మహాకవి పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా గారి స్మృతికి అంకితం ???????????
4599..గజల్.
విశ్వనరుడ నేనంటూ..గళమెత్తిన కవిసూర్యుడు..!
భారత పద్మభూషణుడై..వెలగొందిన కవిసూర్యుడు..!
గబ్బిలముతొ సందేశం..పంపినాడె దైవానికి..
తనప్రతిభతో జాతినే..మెప్పించిన కవిసూర్యుడు..!
అవమానాలు సన్మానాలుగ మలచుకున్న వాడు..
కవి పండిత మూర్ధన్యుల..ఒప్పించిన కవిసూర్యుడు..!
ఫిరదౌసీ కావ్యములో..కవిమనస్సు చిత్రించెనె..
రాచరికపు అవినీతిని..తెగచెరిగిన కవిసూర్యుడు..!
కవికోకిల కవిదిగ్గజ ..కళాప్రపూర్ణుడే చూడ..
నవయుగకవి చక్రవర్తిగ..గర్జించిన కవిసూర్యుడు..!
మధురశ్రీనాథ..కవితా విశారద బిరుదులతో..
విశ్వకవి సామ్రాట్టై..నినదించిన కవిసూర్యుడు..!
"సుకవిజీవించు ప్రజల నాల్కలంద"ని చాటినాడె..
మరి మాధవ గజల్ సుధను..దీవించిన కవిసూర్యుడు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు