4598..గజల్.
ఉన్నావా భూమిమీద..ప్రాణంతో ఓ ప్రేమా..!
నేనున్నా కోకిలనై..రాగంతో ఓ ప్రేమా..!
దైవం మారు రూపమే..నీవుకదా లోకంలో..
జీవితాన అశ్రుఝరుల ..దారంతో ఓ ప్రేమా..!
నవ్వువెనక బాధలన్ని..గ్రహించడం సులువెట్లా..
గాయాలను మాన్పేందుకు..మౌనంతో ఓ ప్రేమా..!
రాయికి జీవం పోసే..ఉలిలో దాగున్నావా..
గుడిపై నిలిపిన బొమ్మల..భావంతో ఓ ప్రేమా..!
మనిషిమనిషి మధ్య దూరమెలా మాయమయ్యేనట..
గుండెచాటు వైరాగ్యపు..దీపంతో ఓ ప్రేమా..!
సకల జగద్రక్షాకర..మంత్రమూల శక్తి నీవు..
వ్రాయరాని అక్షరాల..స్నేహంతో ఓ ప్రేమా..!
హంసలైన కాకులైన..మనగలవా శ్వాసలేక..
మరిమాధవ గజలింటికి..ధ్యానంతో ఓ ప్రేమా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు