212..
జిలకర బెల్లము కలుపును మనసులు..!!
కలిసిన చూపులు నిలుపును మనసులు..!!
జన్మల బంధపు లోతులు చూడగ..
సాయము చేయుచు నడుపును మనసులు..!!
మోహము బాపుచు..మోజులు తీర్చుచు..
అద్భుత తంత్రము జరుపును మనసులు..!!
విలువల వలువలు కాచే అడుగులు..
సంస్కృతి కద్దము చూపును మనసులు..!!
వేదమంత్రములు..వెచ్చని వలపులు..
పండే దిశగా..కదుపును మనసులు..!!
బాసల ఊసులు..భజంత్రీలలో
తియ్యని వెలుగులు నింపును మనసులు..!!
రాధా 'మాధవ' అనురాగమునే..
అక్షతలందున తెలుపును మనసులు..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు