334..
ఏకాంత మందిరాన.. విరహమసలు ఉండదులే..!
బృందావన సీమ 'లోన'..విరహమసలు ఉండదులే..!
చిత్త శాంతి పొందు కొరకు..పరుగులేల ఓ నేస్తం..!
మాట మాటు మౌనమ్మున..విరహమసలు ఉండదులే..!
పసిడి పూల తోట కదా..జీ'వనమది' గుర్తెరిగిన..!
హంస గగన యానమ్మున..విరహమసలు ఉండదులే..!
ప్రియ సఖియా/సఖుడా..నీ మనసే..! తాపమేల ఈ పైన..!
మనస్సాక్షి సాధనమున విరహమసలు ఉండదులే..!
చిలిపితనపు చిత్ర కథలు..గాలివాటమేనోయీ..!
అసలు 'నేను' తెలుసుకొనిన..విరహమసలు ఉండదులే..!
'మాధవు'నకు రాధ తోటి..బంధమేమొ తెలియాలా..!
తనువు - మనసు ఒక్కటైన..విరహమసలు ఉండదులే..!