345..
మనసు బరువు వదిలించే మనసు ఒకటి కావాలీ..
మెరుపు రథం నడిపించే తోడు ఒకటి కావాలీ..!
వెన్నెలంటి చిన్నదాని సొగసు నదిని కోరేవా..
నిన్ను నీవు తెలుసుకునే కన్ను ఒకటి కావాలీ..!
మేఘ మాల గుండె లయల పరుగు పట్టుకోవాలా..!
మౌన వీణ తంత్రులతో నీవు ఒకటి కావాలీ..!
పురి విప్పిన నెమలి ఆట..మాటు ప్రేమ తెలియాలా..!
అణువణువున స్పందనలకు వెలుగు ఒకటి కావాలీ..!
కడలి అలల పాదాలకు పారాణిగ మారేవా..!
కిరణ కిరణ విన్యాసపు మధువు ఒకటి కావాలీ..!
ఆ'రాధా బృందావని రాగాలను నిండేవా..!
మరి'మాధవ' గానమైన వేణు వొకటి కావాలీ..!