351..
చక్కని మెరుపుల హారము నీవోయ్..!
తియ్యని తలపుల దారము నీవోయ్..!
చిక్కని వేడుక ఉన్నది లోలో..!
వాడని వలపుల సారము నీవోయ్..!
మారీ మారని మనసును కనుమో..!
తరగని వెలుగుల ద్వారము నీవోయ్..!
కన్నులకానని మాయది ఎచ్చట..?!
మరగని పొగ కాసారము..నీవోయ్..!
మాటల తుంపర సాక్షిగా కల'వా..?!
చెదరని మనసుకు పారము నీవోయ్..!
రాధా 'మాధవ' సన్నిధి..ఏదీ..!?
ఆరని నిజ సంసారము నీవోయ్..!