Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

359..
***ఆత్మీయ మాన్యశ్రీ..Chandra Arts master.. గారికి ప్రత్యెక ధన్యవాద మల్లికా చందనములతో..! (చిత్ర భావానువాదం మాత్రమే..)
నీ కొరకై ఎదురు చూపు.. తీరేనా ఈవేళా..!?
నిన్ను కోరు మనసు గోడు.. అందేనా ఈవేళా..!?
ఎంత పిచ్చిదాననైతి..?!కనులు మలగకున్నవిగా..!
నా వలపుల పసిడి పొలము..తడిసేనా ఈవేళా..!
ఎంత వెర్రి దాననైతి..పెదవుల తడి ఏమాయెను..?!
నా తలపులు మీటు వెలుగు..పలికేనా..ఈవేళా..?!
పూల పాన్పు అలక మాన్పు ప్రియ రసికా..వేడుకా..!?
గాయమైన ప్రియ హృదయము..మానేనా..ఈవేళా..!?
శ్రియ్యప్రియ..రావేలా..జాగేలా..?!నన్నేలగ..!
నటన కాదు..కలయె నిజము..అయ్యేనా..ఈవేళా..!?
దయ రాదా..?!..'మాధవు'నకు..ఇసుమంతయు..ప్రేయసి పై..!
పోనీలే..తన ఇష్టము..జరిగేనా..ఈవేళా..!?

ఈవేళా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.