360..
వేయి వేల వేకువలకు.. వెలుగుపైట నీ హాసం..!
కోటి కోట్ల పున్నమలకు..జిలుగుపైట నీ హాసం..!
సెలయేరుల పరుగులలో.. ప్రతిఫలించు సోయగమా..!?
మధుర రాగ భావనలకు..మరుగుపైట..నీ హాసం..!
కలల అలల పెదవులపై..కదలు కిరణ జీవనమా..!?
మెరుపు పాట శృతి లయలకు..పలుకుపైట..నీ హాసం..!
కాంతి పూల బృందావని..నీవేగా ఓ సఖియా..!
హృదయ వేణు నాదములకు..పైరుపైట..నీ హాసం..!
విశ్వాలకు..శ్వాసగతులు సవరించే మూలమీవె..!
ప్రణవోదయ..సంగతులకు..చేరుపైట..నీ హాసం..!
'మాధవు'నకు..మౌన సరసివౌతావే వేడుకతో..!
సరసస్వర..హారతులకు..మారుపైట..నీ హాసం..!