364..
చినుకు పాటకు పులకరించే..గింజ గొంతుగ.. మిగిలిపొ..!
పసిడి పూవుల ఎదలు మీటే..మధుర రవముగ..మిగిలిపో..!
వేట కత్తుల భాష వీడే.. దారి పట్టగ తెలియుమా..!
వెలుగు వెల్లువ దిమ్మరించే..స్నేహ సుమముగ..మిగిలిపో..!
అలజడంతా..అలల కడలిగ మనసు ఉంటే తప్పదోయ్..!
బాంబు దాడులు నిలువరించే..ప్రేమ వనముగ..మిగిలిపో..!
వలలు విసిరే తత్వమేలా..వాదనలతో వేదనోయ్..!
కలలు సకలం కాల్చివేసే..ఇంద్ర ధనువుగ..మిగిలిపో..!
మంత్రమేదీ లేదు చూడూ..మనిషి ఋషిగా ఎదగగా..!
పట్టుదలగా తలపు నిలిపే..అగ్ని ధనముగ..మిగిలిపో..!
రాధ సాక్షిగ ఉన్న తనువే..'మాధవు'నకు వేదికోయ్..!
శ్వాస మురళికి నాదమవగా..సత్య స్వరముగ..మిగిలిపో..!