377..
నీ నవ్వే పూసెనులే..నా ఎదలో గోరింటై..!
నీ చూపే విరిసెనులే..నా కలలోగోరింటై..!
వెంటాడే సొగసరివే..ప్రేమంటే..తెలియదులే..!
నీ తలపే..నిండెనులే..పాటలలో గోరింటై..!
సింధూరం నీ నుదుట నేనైతే..చాలునులే..!
నీ పిలుపే..మెరిసేనులే..స్వరములలో..గోరింటై..!
సంస్కృతికే అద్దంలా నీ మోమే ఉన్నదిలే..!
నీ సొగసే..వెలిగెనులే..కవితలలో..గోరింటై..!
పసిడి సన్నజాజి తీగ సిగ్గుపడును నిను జూచి..!
నీ మనసే..ఒదిగెనులే..చిగురులలో..గోరింటై..!
'మాధవు'నకు..పసందైన ఆ నాయిక నీవేగా..!
నీ రూపే..మిగిలెనులే..శ్వాసలలో..గోరింటై..!