గజల్ 3623.
నరాలుతెగు ఉత్కంఠను..రేపకుమో ప్రియసఖియా..!
మధుశాల దారికడ్డు..తగలకుమో ప్రియసఖియా..!
నీవు మోసగించలేదు..నా సమయం బావులేదు..
నా సమాధిపై తలను..ఆన్చకుమో ప్రియసఖియా..!
నీ కురులను ముద్దాడే..గాలినడుగు చెబుతుంది..
నిర్భాగ్యుని వలపునింక..మోయకుమో ప్రియసఖియా.!
మరపురాని మరువలేని..తనముకన్న మధువేదో..
యేఱులైన అశ్రునదిని..ఆపకుమో ప్రియసఖియా..!
నీ జాలియె ఊయలగా..మారిందా నిదురపుచ్చు..
ప్రాణమిలా పోనీ మరి..నిలుపకుమో ప్రియసఖియా..!
మరి మాధవ గజలేమో..అగ్గిపూల వానలాగ..
ప్రేమగాయం మాన్పగా..చూడకుమో ప్రియసఖియా..!