గజల్ 3715.
నిన్నునీవు సరిగ తెలియ..సమయమిచ్చిరి ఎవ్వరు..!
అహంకారము తొలగునెట్లా..తెలియజెప్పిరి ఎవ్వరు..!
పశుపక్షుల భక్షణముతో..'కరుణ'మరచిరి ఎవ్వరు..!
'కరోనా'గా జనులపైబడి..చంపుచుండిరి ఎవ్వరు..!
నియమనిష్ఠలు సంప్రదాయము..కాలరాసిరి ఎవ్వరు..!
ఎవరుచెబితె ఎవరు విందురు..విర్రవీగిరి ఎవ్వరు..!
మరణభయమే పడగలెత్తగ..బ్రతికిపోయిరి ఎవ్వరు..!
"శ్వాసయోగము" పట్టుబట్టక..మేలమాడిరి ఎవ్వరు..!
పరమగురువుల మౌనశక్తిని..తప్పుపట్టిరి ఎవ్వరు..!
మనసులోపలి చెత్త కాల్చక..కాలుచుండిరి ఎవ్వరు..!
బహుమతిచ్చే మాన్యమతులకు..వంతపాడిరి ఎవ్వరు..!
బుద్ధి పుచ్చిన పుచ్చుమతులను..మట్టుబెట్టిరి ఎవ్వరు..!
అడుగడుగున నాటకాలే..ఆడుచుండిరి ఎవ్వరు..!
స్వీయరక్షణ వలయమేదో..చేరకుండిరి ఎవ్వరు..!
మహమ్మారిని తరిమికొట్టగ..కవితలల్లిరి ఎవ్వరు..!
మాధవునితో కూడలేకే..రాలుచుండిరి ఎవ్వరు..!
తెలియజెప్పిరి ఎవ్వరు..!
గజల్