గజల్ 3772.
విర్రవీగు వెర్రితనం..పూవులాగ..రాలిందా!
'నాది-నేను' నీ చేతిలొ..లేదన్నది తెలిసిందా..!
కక్ష సాధింపులేల..దొంగదెబ్బ లెవరిపైన..
మారణాయుధాలు వాడు..అవసరమే తీరిందా..!
శాంతికొరకు పాటుపడే..సంగతెంత నాటకమోయ్..
ప్రాణికోటి సంరక్షణ..ఆచరణగ మారిందా..!
ఊపిరింటి దీపముతో..ఆటలెన్ని ఆడేవో..
ఆ వెలుగుల నిధి చేరే..మార్గమేదొ దొరికిందా..!
గురువులెవరు ఉన్నారట..గుప్తవిద్య నేర్పేందుకు..
గుట్టులెల్ల వివరించే..శ్వాసతోడు నిలిచిందా..!
అందమైన చెలిమివనం..ఈ విశ్వం మాధవుడా..
వైరస్ ల మూలమేదో..పట్టుకోగ కుదిరిందా..!