గజల్.. 3752
ఎంత బాధ పడుతున్నది..చెప్పకుండె చిన్ని మనసు..!
బడికివెళ్ళు ముచ్చటేమొ..తీరకుండె చిన్ని మనసు..!
ఆడుకోగ బయటికెళ్ళు..సంగతియే లేదు కదా..
ఐస్ క్రీములు తినగ వీలు..చిక్కకుండె చిన్ని మనసు..!
గప్ చుప్ లు గులాబ్ జామ్ లు..మర్చిపోక తప్పదటా..
ఎగ్జిబిషను మిర్చిబజ్జి..మరువకుండె చిన్ని మనసు..!
పెద్దపెద్ద చదువులంట..పెంచె అంటరానితనం..
బస్సు రైలు విమానాలు..మిగలకుండె చిన్ని మనసు..!
షేక్హాండులు మాయమయ్యె..హగ్గులన్ని బొగ్గులయ్యె..
ఎవరికెవరు ఏమౌదురొ..తెలియకుండె చిన్ని మనసు..!
మాధవుడా దిక్కుమొక్కు..లేని బతుకు బతుకేనా..
మరణభయం అనుక్షణం..వీడకుండె చిన్ని మనసు.