380..
బిడియపడే చినుకు వలపు.. పలకరించె వాకిలిలో..!
గడియ పడని తలపు మనసు.. పలకరించె వాకిలిలో..!
అడుగడుగున ఎదురుపడే..అందాలకు తెర తీస్తూ..
కలవరించు మౌనాలను..పలకరించె వాకిలిలో..!
తేనియలను చిందించే..పూవులలో చిరునగవై..
గెలువ..లేని మోహాలను..పలకరించె వాకిలిలో..!
సిరిమువ్వల నాదాలను.. నిదురలేపు స్వర ధారై..
మది వనమున రాగాలను..పలకరించె వాకిలిలో..!
కలహించే కలువ చెలుల..విసుగు మాన్పు..నెర జాణరొ..!
తెలియ రాని భావాలను..పలకరించె వాకిలిలో..!
'మాధవు'డా..! ఏమి కథర..నీ ప్రేమకు అంతేదీ..!
మాయ సేయ..నా భ్రమలను..పలకరించె వాకిలిలో..!