389..
సొగసులన్ని దాచుకున్న.. నును సిగ్గుల చినదానా..!
ప్రకృతి మాత ప్రతీకలా..చూచుచున్న..చినదానా..!
నీ తలపుల నిండుతనం..వర్ణించగ..నా తరమా..!
నిశ్చలతకు బింబంలా..ఒదిగి యున్న చినదానా..!
నీ చూపుల వెలుగులలో..ఈ జగమే విరియునులే..!
ఆకాశపు తత్వంలా..పరచుకున్న చినదానా..!
పంట చేల సోయగాలు..భావనలో నింపేవా..!
చైతన్యపు సాక్ష్యంలా..నిలిచి యున్నచినదానా..!
ఆశయాల చుక్కానికి..ఊపిరులే ఊదేవా..!
అందాలకు అందంలా..వెలుగుతున్న చినదానా..!
విశ్రమించి యున్నావా..ఆ 'మాధవ' రాక కొరకు..!
మెరుపు వీణ నాదంలా..కులుకుతున్న చినదానా..!