400..
నీ తియ్యని కను పాపల చూసుకొందు చెలిమి మీర..!
నా ప్రేమను అక్షరాల పంచుకొందు చెలిమి మీర..!
మచ్చ లేని స్నేహానికి ప్రతిరూపం నీవేగా..!
నీ స్వరముల ఊటలలో కలుసుకొందు చెలిమి మీర..!
శరత్కాల చంద్రికలకు పరిమళాలు పొదిగేవా..!
నా తలపుల శ్వాసలలో పాడుకొందు చెలిమి మీర..!
ఊహ లోని ఆ హాయిని..చెప్పాలా మాటలలో..!?
నీ చూపుల దారులలో..నిలుపుకొందు చెలిమి మీర..!
సరిగమలకు గమకాలకు మైత్రి కూర్చు నెరజాణా..!
నా పదముల లోయలలో..పొదువుకొందు..చెలిమి మీర..!
మౌనాలను మీటుచున్న..'మాధవు'డా..ప్రియ సఖుడా..!
నీ వరమగు రవములలో..దొరలుచుందు..చెలిమి మీర..!