401..
అమావాస్య అడ్డు పడదు..నా తోడై నీవుంటే..!
ఎడారేమి చేయలేదు..నా తోటై నీవుంటే..!
వసివాడని నీ వెలుగే నా ప్రాణం..నా గానం..!
విరహానికి తావు లేదు..నా పాటై నీవుంటే..!
నా ఊహకు ఊపిరైన వెన్నెలకే..నాదమీవు..!
మెరుపు వీణ ఆగదులే..నా శ్వాసై నీవుంటే..!
కలవరించు కలువ కలలు పండించే..జాబిలీవు..!
ముద్దు బంతి పరవశించు..నా స్పర్శై నీవుంటే..!
అలల చీర కుచ్చిళ్లకు మువ్వలలో స్వరము నీవు..!
గాలి తెరలు నినదించును..నా పదమై నీవుంటే..!
రాధ కూడి 'మాధవు'డే దొంగాటలు ఆడేనట..!?
సత్యమేదొ పులకించును..నా వెలుగై నీవుంటే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు