407..
నిన్ను తలచుకోగానే..గజల్ మధువు పొంగెనులే..!
నీ చూపులు సోకగనే..భావ సుధలు పొంగేనులే..!
స్నేహానికి చిరునామా..ఉంది కదా..నీ నవ్వున..!
నీవు వెన్ను తట్టగనే..వెలుగు నదులు పొంగెనులే..!
ఆత్మీయత పరిమళించు కవితాలత నీవేగా..!
నీతలపులు మీటగనే..తీపి కలలు పొంగెనులే..!
నీ జడలో సంపెంగగ మిగలాలను కోరికేల..!
నీ అడుగుల నడువగనే..ఆశ జలలు పొంగెనులే..!
పరిమళించు వెన్నెలలకు పాట నేర్పు నెరజాణా..!
నీవు మదిని నిండగనే..ప్రాణ నిధులు పొంగెనులే..!
'మాధవ'సుధ..నీవేనని తెలిసినదన..కుదరదులే..!
నిన్ను గూర్చి పలుకగనే..అమృత సిరులు పొంగెనులే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు