411..
దసరా పండుగ శుభాకాంక్షలతో..
కణకణమున వెలుగు పూల నవ్వుల్లో బతుకమ్మా..!!
ప్రతి మదిని పొంగు పాల ముసుగుల్లో బతుకమ్మా..!?
పూలు తెంపి వాటి సుఖము నేల రాయ భావ్యమౌనె..?!
ఈ మనుషుల ఛాదస్తపు ముదముల్లో బతుకమ్మా..!?
పువ్వైనా.. ఆకైనా.. తెంచు వేళ.. మొక్క బాధ తల్లికెరుక..!
కర్మ చక్ర మనసు కథల..దారుల్లో బతుకమ్మా..! ?
పెంచు మాట మరచి చంపు వారు భువిని నరులేనా..!?
చినుకు జాడ కరువయ్యిన మబ్బుల్లో బతుకమ్మా..!?
ఉయ్యాలా.. అనుచు పాడు పాటలలో ఉన్నావా..?!
వేరుపడిన నీరు లేని చెరువుల్లో..బతుకమ్మా..?!
సమస్యలకు తల వంచని ధీరత్వము నీ సొంతము.!!
ఆ'మాధవ' తత్వానికి సద్దుల్లో బతుకమ్మా..!!!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు