416..
జన్మల చిరుగుల దుప్పటి కాల్చే దెప్పుడు నేస్తం..!?
కర్మల మరిగే బాణలి వదిలే దెప్పుడు నేస్తం..!?
తియ్యని కలలకు ద్రోహం ఎన్నడు జరుగదు చూడూ..!
కోర్కెల మబ్బుల కౌగిలి వీడే దెప్పుడు నేస్తం..?!
ఆశల రెక్కల బలమది ఎంతోతెలియుట ముఖ్యం..!
కులాలు మతాల గొంగళి విసిరే దెప్పుడు నేస్తం..!?
అసలగు మైత్రికి తలుపులు తీసే మనసే నీదోయ్..!
కలతల పొగిలే జావళి నిలిపే దెప్పుడు నేస్తం..!?
శ్వాసల కొలువగు మౌనపు తోటన చేరగ తలచుము..!
మారణ కాండల వారధి కూల్చే దెప్పుడు నేస్తం..?!
'మాధవ' ప్రేమకు సాక్షిగ మారగ తెలియవె..!
తలపుల రగిలే హిమగిరి కరిగే దెప్పుడు నేస్తం..?!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు