431..
మరుమల్లెల నది సాగెను - నీ నవ్వుల గగనంలో..!
సిరివెన్నెల శృతి మ్రోగెను - నీ నవ్వుల గగనంలో..!
కరిమబ్బుల మెరుపులలో- నీ పాటలు ఉన్నవిలే..!
కాంతి పూల జడి ఒదిగెను - నీ నవ్వుల గగనంలో..!
భువి వసంత కోవెలగా - తోచినదే నీ జతలో..!
పారిజాత సడి విరిసెను - నీ నవ్వుల గగనంలో..!
కల్పవృక్ష తరుఛాయలు - కలవరించు ముచ్చటలా..!
స్వర్ణ కమల ధృతి కురిసెను - నీ నవ్వుల గగనంలో..!
కోటి కోట్ల దేవతలను - అలరించే మౌనరాణి..!
'శ్వాస-ధ్యాస' సతి మురిసెను - నీ నవ్వుల గగనంలో..!
'మాధవు'నే నిలిపివేయు - మోహనాంగి నీవేగా..!
వేణురాగ గతి వెలిగెను - నీ నవ్వుల గగనంలో..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు