444..
వెన్నెల మువ్వల రవరవలున్నవి నీ నవ్వులలో..!
అరవిరి పువ్వుల కలకలలున్నవి నీ నవ్వులలో..!
గూడును వదలని చీకటి గుడిలో సవ్వడి చేసే..
తియ్యని గువ్వల కువకువలున్నవి నీ నవ్వులలో..!
మబ్బుల వీణను మీటే చేతికి సొగసులు దిద్దే..
మెరుపుల రవ్వల తళతళలున్నవి నీ నవ్వులలో..!
ఓషధి లతలకు ఊపిరు లూదుతు వడిగా సాగే..
పారే యేరుల గలగలలున్నవి నీ నవ్వులలో..!
శ్వాసల సాక్షిగ కురిసే కాంతుల ధారల మెరిసే..
మౌనపు వెలుగుల నవనవలున్నవి నీ నవ్వులలో..!
బృందావనిలో రాధా 'మాధవ' క్రీడను నడిపే..
తలపుల పక్షుల కిలకిలలున్నవి నీ నవ్వులలో..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు