445..
ఉదయకాంతి అరుణిమలో- రాగసుధల పలకరింపు..!
ఆకుపచ్చ ఊయలలో - ప్రేమసుధల పలకరింపు..!
కన్నులార చూసేందుకు - సిద్ధమాయె నా హృదయం..!
పూల ఋతువు శ్వాసలలో - స్నేహసుధల పలకరింపు..!
ఎంత వింత పులకరింత - చూసానో నీ కన్నుల..!
పలుక రాని తలపులలో - ప్రణయసుధల పలకరింపు..!
జాబిలికే మత్తు గొలుపు - పరిమళాలు కురిసేవే..!
తెలుపలేని వెన్నెలలో - భావసుధల పలకరింపు..!
కలలవీణ శృతి చేసే - వేలి కొసల నర్తనమా..!
కల హంసల మువ్వలలో - నాదసుధల పలకరింపు..!
'మాధవు'నకు వేణువుగా - మారిన ఓ మనోహరీ..!
యమునాతటి పదములలో - విరహసుధల పలకరింపు..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు