448..
మది లోని తలపులన్ని - చిత్రమందు చేరెనుగా..!
కుంచె లోని ఒడుపులన్ని- హృదయమందు పొంగెనుగా..!
చెలి మోమున తెలుపలేని - భావాలకు కాన్వాసా..?!
పులిమేసిన రంగులన్ని- నీడలందు చితికెనుగా..!
చెక్కిలింటి సోయగాలు - చెలియ కనులు తెలిపేనా..!?
పలుకరాని మెరుపులన్ని- చూపులందు పండెనుగా..!
చిత్రకారు డెవరన్నది - అప్రస్తుత మనుకున్నా..
'చంద్ర'కాంతి సొగసులన్ని- రాత్రులందు ఒదిగెనుగా..!
నవ నాయిక వేదనలను - చిత్రించగా తరమౌనే..?!
చెక్కుకున్న చిక్కులన్ని- వలపులందు ముసిరెనుగా..!
'మాధవు'డా.. ఆ 'రాధా - చిత్రమేల శిల్పమాయె..!?
నీ లీలల ముసుగులన్ని- మనసులందు విరిసెనుగా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు