456..
నీ కొరకై ఎదురుచూపు - కోవెలగా రూపు దాల్చె..!
నీ తలపే తేనెలొలుకు - వెన్నెలగా రూపు దాల్చె..!
తెలుప వశము కాదు సఖా - ఎద నిండిన నీ ప్రేమను..!
నీ చూపే ముత్యాలకు - ఊయెలగా రూపు దాల్చె..!
వేణువింటి రాగాలకు - విరహాలను మాన్పేవా..!
నీ వలపే మోహాలకు - ఓ కలగా రూపు దాల్చె..!
మందహాస నాదాలకు - పరిమళాలు అలదేవా..!
నీ నవ్వే స్వరజతులకు - నిజ జల'గా రూపు దాల్చె..!
ఈ మీరా భక్తి మీర - కొలిచేనే ముదమారా..!
నీ పదమే శృతిలయలెన్నుపూస నీ తలపు..!
ప్రేమకడలి దీపాలకు - వెలుగుపూస నీ తలపు..!
మనసు కాల్వ దుర్కు - తగు వల'గా రూపు దాల్చె..!
అంతులేని అభినయముల - కథ నడిపే 'మాధవుడా'..!
నీ వెలుగే విశ్వములకు - తిరు మల'గా రూపు దాల్చె..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు