459..
నీ చూపుల రాలు మధువు - గ్రోలలేని బ్రతుకెందుకు..!?
నీ స్నేహపు పొన్ననీడ - పొందలేని బ్రతుకెందుకు..!?
సిగ్గు మాటు నిగ్గులన్ని - నివ్వెర పడు ముచ్చటేది..?!
నీ తలపుల వెలుగు మేడ - చేరలేని బ్రతుకెందుకు..!?
చినుకుపూల పరువాలకు - పందిరేల కరువౌనో..!?
నీ పలుకుల మౌనవీణ - కాంచలేని బ్రతుకెందుకు..!?
అల్పజీవిననుకుంటే - అపరాధం.. అన్నావే..!
నీ తియ్యని పాటఊట - మీటలేని బ్రతుకెందుకు..!?
మార్గ-శీర్ష వెన్నెలలో - విహరించగ తెలియదాయె..!
నీ యమునా తటసీమన - నిలువలేని బ్రతుకెందుకు..!?
''మాధవుడా..!'' నవ్వేవా - నా కలలకు అద్దంలా..!
బృందావని సొగసునదిని - వీడలేని బ్రతుకెందుకు..!?
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు