Skip to main content

User account menu

  • Log in
Home

తెలియునోయీ చేప ఆకలి

Breadcrumb

  • Home
  • తెలియునోయీ చేప ఆకలి
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Wed, 11/03/2021 - 19:28

462..
గాలమేసే వానికెట్లా - తెలియునోయీ చేప ఆకలి..!?
చేనుమేసే కంచెకెట్లా - తెలియునోయీ మొక్క ఆకలి..!?
వల్లమాలిన స్వార్థచింతన - పెరిగినప్పుడు దిక్కు తోచదు..!
బాణమేసే చేతికెట్లా - తెలియునోయీ జింక ఆకలి..!?
మనిషి ధర్మము హింస కాదని - కోటి గొంతుల పలికినా..
చంపి మేసే జాతికెట్లా - తెలియునోయీ హంస ఆకలి..!?
చదువు సంధ్యల ధ్యాస పెట్టక - పక్క దారులు త్రోక్కితే..
వలలు వేసే కంటికెట్లా - తెలియునోయీ చిలుక ఆకలి..!
స్నేహసుధనే పంచు టెరుగగ - గొడవ దేనికి మనసు లోతున..
దాడిచేసే బుద్ధికెట్లా - తెలియునోయీ ప్రేమ ఆకలి..?!
'మాధవుని'కే అంకితమవక - మాటలాడిన ఫలితమేమీ..?!
కవిత వ్రాసే కలముకెట్లా - తెలియునోయీ నవత ఆకలి..!?

మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

తెలియునోయీ చేప ఆకలి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

మా ప్రియతమ రైతన్నా
మాధవరావు కోరుప్రోలు
గజల్
మనసుకోసం వెతుకుతున్నా
మాధవరావు కోరుప్రోలు
గజల్
గెలుచుకొనగ తెలుపుమింక
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఈ చెలిమికి సెలవివ్వకు
మాధవరావు కోరుప్రోలు
గజల్
తెలియదుగా
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 34
  • Page 35
  • Page 36
  • Page 37
  • Current page 38
  • Page 39
  • Page 40
  • Page 41
  • Page 42
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad