478..
మౌనంగా నవ్వుతున్న రాయిలాగ బ్రతికేద్దాం..!
ఎన్నటికీ ఆరిపోని అగ్నిలాగ బ్రతికేద్దాం..!
నన్ను నేను తెలిసేందుకు దారి చూపు మానసమా..!
పూలమధువు లూరించే గాలిలాగ బ్రతికేద్దాం..!
బొమ్మలాట చూస్తున్నా అంతు చిక్కదేమిటసలు..!?
ప్రాణశక్తితో పొంగే మట్టిలాగ బ్రతికేద్దాం..!
కొమ్మలలో కోకిలమ్మ పాడుతున్న రాగమేదొ..!?
గ్రహియించిన అమృతభావ సాక్షిలాగ బ్రతికేద్దాం..!
అనుబంధపు కోవెలగా పుడమితల్లి వెలుగుతుంటె..
అభిషేకపు తీర్థమైన నీటిలాగ బ్రతికేద్దాం..!
'మాధవు' 'నే' నమ్ముకున్న రాధకెవరు కావాలిక..!?
బృందావని నల్లుకున్న నింగిలాగ బ్రతికేద్దాం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు