483..
కోటి మల్లెలు పూసినట్లుగ నవ్వులుంటే హాయి కాదా..!
మేఘమాలలు సాగు తీరుగ మనసులుంటే హాయి కాదా..!
నారికేళపు కేళులందున కోర్కెలేలా తీరునో మరి..!
దైవమెవరో తెలుసుకొనగా భక్తులుంటే హాయి కాదా..!
శత్రు గణములు ఎక్కడున్నవి..ఆరు గుణముల చిలువలేగా..!
అర కన్నుల జగములేలే శక్తులుంటే హాయి కాదా..!
హంసగీతిని ఆలకించే మార్గమేదో తెలియవలెగా..!
ఎల్లజనులతొ మైత్రి నెరపే యుక్తులుంటే హాయి కాదా..!
పుణ్యపాపము లేవి తెలియని జీవరాశుల చంపి తినుటా..?!
ప్రేమభావం మనిషి మనిషి అందుకుంటే హాయి కాదా..!
తనకుతానే సాక్షియగుటకు శ్వాసలోతుల నిధిని పొందీ..
మానవుడే 'మాధవు'డై మసలుకుంటే హాయి కాదా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు