486..
వ్రాయ రాని గజలులాగ ఊరిస్తూ ఉంటావే..!
దాచలేని మెరుపులాగ కవ్విస్తూ ఉంటావే..!
వర్ణించగ వీలు కాని సొగసంటే నీదేలే..!
చేజిక్కని మధువులాగ వర్షిస్తూ ఉంటావే..!
నీ ఎదురుగ కూర్చుంటే మాయమౌను మాయలన్ని..!
వదలలేని వలపులాగ బంధిస్తూ ఉంటావే..!
ప్రతి పూవుల తోటలోని వసంతాల రాగనిధీ..!
గతితప్పని స్వరములాగ వినిపిస్తూ ఉంటావే..!
ఆ కొండలు సెలయేరులు ఎలా కలసి ఉంటాయో..?!
శృతి తరగని వెలుగులాగ వ్యాపిస్తూ ఉంటావే..!
ఈ రాధను బృందావని నిలిపిన 'మాధవు'డా..!
యమునాధుని నవ్వు లాగ ప్రవహిస్తూ ఉంటావే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు