495..
రుణాలన్ని తీరేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
జన్మచెరలు తొలగేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
ఎన్ని మహా విశ్వాలో ~ ఒక హృదయపు కోవెలన..!
ప్రేమరూపు అందేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
ఏకాంతపు మాధుర్యం ~ ప్రసాదించు మౌనమది..!
మైత్రినిధిని పొందేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
ఎవ్వరేమి అన్నాసరె ~ సాక్షిలాగ జీవించు..!
ఈ సత్యం తెలిసేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
'శ్వాస మీద ధ్యాస' వలన బాధలన్ని మటుమాయం..!
మనసు మాయ దాటేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
సంకల్పము విశ్వశాంతి ~ కావాలని కోరుకో..!
'మాధవు'నిగ మారేందుకు ~ ధ్యానమొకటె శరణ్యం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు