|| 496 ||
నీకోసం ప్రవహించిన అమృత మధుర గీతమేను..!
నా హృదయమె ఒలికించిన ప్రణయభావ గీతమేను..!
ఎపుడు కలుగునో సఖియా..నాపై నీ అనుగ్రహం..!?
ఎదురు చూపు వర్షించిన స్నేహరాగ గీతమేను..!
మాయతెరలు మాయ చేయు ఆ దేవత నీవేగా..!
నీ సన్నిధి ఆశించిన భక్తిపుష్ప గీతమేను..!
నీ లేఖల సుమవనమున విహరించుచు నిలచినాను..!
నీచూపులు పలికించిన నవవెన్నల గీతమేను..!
మన జన్మల జ్ఞాపకాల శిథిలాలే బహుమతులా..!
నా కలలే చిందించిన ప్రాణదీప గీతమేను..!
నా 'మాధవ'..ఆ'రాధవు నీవేనని తోచెనుగా..!
బృందావని నిదురించిన దివ్యశ్వాస గీతమేను..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు