Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

506..
అమ్మ ఒడిలో వెలుగు చూసిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
గుప్పెడిసుకన దిద్ది నేర్చిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
బెత్తమెత్తని నాన్నగారే మొదటి మాస్టరు ఎవరికైనా..!
గున్నమామిడి కొమ్మ నీడన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
మాటిమాటికి అలుకలెందుకు..కోపమేలా..నీకు నీపై..!
ఆటపాటల దారి నిండిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
ఏది నిజమో..ఏదబద్ధమొ..పసిమనసుకు ఎలా తెలియును..!? 
సుద్దముక్కతొ మట్టిపలకన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
చెట్టుపుట్టలు..చెరువుగట్టులు నిత్యగురువులు మనసు పెడితే..! 
తలపు జలధిన ఈతకొట్టిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
దేశదేశము లన్నితిరిగే భాగ్యమేలా కలిగెనోయీ..!?
బాల్యక్రీడగ బంతులాడిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!
విశ్వప్రేమను పంచిపెట్టే..దారి నడిపే వేణు 'మాధవ'..!
మౌన మైత్రిని నిధిగ ఇచ్చిన అక్షరాలే బ్రతుకు దివ్వెలు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

అక్షరాలే బ్రతుకు దివ్వెలు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.