509..
నీ కన్నుల పాటలోన నేను కరిగిపోవాలీ..!
నీ వలపుల తోటలోన నేను సోలిపోవాలీ..!
నీవు గాక తోడెవ్వరు నా ఊపిరి దారికి..?!
నీ వెలుగుల ఊటలోన నేను తేలిపోవాలీ.. !
తేనియలకు తియ్యదనము మాటేమిటి..?!
ఆ పలుకుల బాటలోన నేను సాగిపోవాలీ..!
ఏకాంతపు కాంతి పూలు ఏరుకొనగ కాంక్ష కలిగె..!
నీ తలపుల కోటలోన నేను నిలచిపోవాలీ..!
నేను కాని నేనేదో నన్ను పిలచు వేళ చూడ..
నీ పెదవుల పేటలోన నేను ఇగిరిపోవాలీ..!
'మాధవుడా'..! నీ ప్రేయసినైన చాలు ఈ జన్మకు..
నీ మధువుల వేటలోన నేను మిగిలిపోవాలీ..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు