513..
నను వలచిన చెలియ మనసు..కొండవాగు మల్లె ఉంది..!
తన చూపున కురియు సొగసు..నిత్యమధువు మల్లె ఉంది..!
ఆమె తలపు చెక్కిళ్ళకు..ఎన్ని కాంతి సందడులో..
యేటినీటి అద్దాలకు..పూతమెరుగు మల్లె ఉంది..!
గులాబితో గుసగుసలకు..వీలు చిక్కె తన స్వరముకు..
వరములొసగు పవనాలకు..శ్వాస వధువుమల్లె ఉంది..!
కళ్యాణపు సిరులత్రోవ..కలహంసల రాగధార..!
మధురాపురి దారి చూపు..పాట పిలుపుమల్లె ఉంది..!
చినుకు పూల రథములోన..పయనించే హాసమేమొ..
మావికొమ్మ మౌనాలకు..లయల వెలుగుమల్లె ఉంది..!
ఆ'రాధా మానసమే..పూర్ణచంద్ర బింబమౌను..!
ప్రియ 'మాధవ' తత్వమునకు..తేట సరసుమల్లె ఉంది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు