525..
నిద్దురలో మెలకువలో.. సాయమయే ఓ చెలియా..!
నా తలపుల ఊయలలో..రాగమయే ఓ చెలియా..!
ఈ జగాన వర్షించే..వేదాంతసుధా ధారా..!
నా చూపుల దారాలకు..సాక్ష్యమయే ఓ చెలియా..!
గొప్పలిడే తప్పిదాల.. వర్ణాలకు మెరుగులేల..?!
నా చేతనా వికసించగ..వ్యక్తమయే ఓ చెలియా..!
క్షణాల కనురెప్పలలో..ఆ అలికిడి శ్వాస నీవు..!
పలుకుతేనె మౌనాలకు..గగనమయే ఓ చెలియా..!
వలపుసిరులు దివ్వెలుగా..వెలుగుతున్న కోవెలలో..
నన్ను నిలిపి మురిపించే..స్వప్నమయే ఓ చెలియా..!
అణువణువున బృందావన సీమ చూపు 'మాధవు'నకు..
హృదయలయల వేణునాద..మూలమయే ఓ చెలియా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు