530..
లోలోకి పయనింప ~ పూనాలి మౌనమే..!
సాక్షిగా జీవింప ~ పూనాలి మౌనమే..!
అసలైన ప్రేమనిధి ~ ఉందంతరంగాన..!
అందుకుని కురియింప ~ పూనాలి మౌనమే..!
మాటాడు వేళైన ~ ఆభరణ మదియేను..!
సత్యమ్ము గమనింప ~ పూనాలి మౌనమే..!
నిజ మైత్రి ద్వారమై ~ నిలచేను హృదయమే..!
లోకాలు పాలింప ~ పూనాలి మౌనమే..!
పనులేవి చేసినా ~ శాంతమే వరమవగ..
జ్ఞానమే సాధింప ~ పూనాలి మౌనమే..!
'మాధవా'..! అనగానె ~ మోక్షమ్ము దొరకునా..?!
మనసు'నే పండింప ~ పూనాలి మౌనమే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు