547..
అమృతాన్ని మరపించును..అహంకార మాధుర్యం..!
కళాకృతులు సృష్టించును..అహంకార మాధుర్యం..!
అందలేని గంధాలకు..అతీతమే మానసమోయ్..!
కలలతోటి రమియించును..అహంకార మాధుర్యం..!
అపజయాల నీడలసలు..అపహాస్యం చేయలేవు..!
మౌనవనికి నడిపించును..అహంకార మాధుర్యం..!
దెబ్బతీయు పులిపంజా..మారునులే గొడుగుమల్లె..!
స్వేఛ్చసుధలు పండించును..అహంకార మాధుర్యం..!
వ్యాపారపు దృక్పథమే..తలక్రిందులు అయి తీరును..!
మైత్రినిధిని అందించును..అహంకార మాధుర్యం..!
ఆ'మాధవ' దేవునిదే..వేణునాద రసజగమోయ్..!
ప్రేమమధువు వర్షించును..'అహం'కార మాధుర్యం..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు