552..
గులాబీల చెక్కిళ్ళను ~ వెక్కిరించు ముచ్చటేల..?!
శూన్యవీణ రాగాలను ~ ధిక్కరించు ముచ్చటేల..?!
ప్రతి హృదయపు కోవెలలో ~ వెలుగుపూల నిధి ఉన్నది..!
పొందలేని భోగాలను ~ తస్కరించు ముచ్చటేల..?!
పరికరముగ ఉండేందుకు ~ కష్టమేమి వచ్చిందట..?!
ఈ నేను'ల కావ్యాలను ~ ఆశ్రయించు ముచ్చటేల..?!
కన్నులుండి.. చూడలేనితనమేదో ~ కమ్ముకొనెను..!
పట్ట'లేని..గంధసిరుల ~ పరవశించు ముచ్చటేల..!?
చరితలోన మైలురాళ్ళు ~ నాటేందుకు ప్రయాసలా..?!
హాస్యాస్పద పీఠాలను ~ అధివసించు ముచ్చటేల..!?
ఆ'మాధవ' గీత తెలియ ~ మౌనవేణు వవ్వాలోయ్..!
మట్టిప్రమిద హాసాలను ~ విస్మరించు ముచ్చటేల..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు