564..
నీ నవ్వుల వెన్నెలతో..నిండు'నదీ మధుపాత్ర..!?
నీ చూపుల తేనెలతో..పొంగు'నదీ మధుపాత్ర..!?
విరహగగన వీధులలో..సంచరించు వేళలో..
నీ తలపుల సొగసులతో..మురియు'నదీ మధుపాత్ర..!
నిశినిశికీ బహుమతిగా మల్లెలెన్ని ఇచ్చునో..!?
నీ పలుకుల మెరుపులతో..కులుకు'నదీ మధుపాత్ర..!
జలధిజలధి మానసమున ఎన్ని నిధులు దాచునో..!?
నీ ఒంపుల వన్నెలతో..ఆడు'నదీ మధుపాత్ర..!
కలనైనా కలహించని సుస్వరాల ధారవే..!
నీ పిలుపుల చిన్నెలతో..పాడు'నదీ మధుపాత్ర..!
ఆ'రాధను లాలించే..ఓ మురళీ 'మాధవుడా..'!
నీ అడుగుల రవళులతో..సాగు'నదీ మధుపాత్ర..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు