569 ..
ఆ కోకిల పాడుతున్న దేరాగమొ తెలియదుగా..!
నా మనసున కమ్ముకున్న దేమోహమొ తెలియదుగా..!
నీవు నన్ను ఇష్టపడితె..కలిసేందుకు జాగెందుకు..?!
దూకుతున్న సెలయేటిది ఏ భావమొ తెలియదుగా..!
హరితవర్ణ పరికిణీకి..సింధు భైరవీ ఓణీ..!
నవ్వుతున్న మౌనవీణ హృదయమేమొ తెలియదుగా..!
ఆ చెట్టున ఈ గట్టున..కలరవాల పక్షులెన్నొ..!?
నా ఎదలో రగులుతున్న విరహమేమొ తెలియదుగా..!
కనిపించని ఇంద్రధనువు లెన్నున్నవొ ప్రతి తలపున..?!
నిజమవ్వక ఇగురుతున్న స్వప్నమేమొ తెలియదుగా..!
ఆ 'మాధవ' యమునాతటి విహరించే రాధెవరో..?!
నా దేవత తెలుపనున్న సత్యమేమొ తెలియదుగా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు