గజల్ మహల్..03-01.// 589 //
గగనవీధుల సాగిపోయే..మేఘమాలా కురియవేలా..!?
బావ మనసుకు లేఖ వ్రాసే..రాగమాలా కురియవేలా..!?
పరుగు తీసే నదీ గలగల..పలకరింపున అతని నవ్వే..!
వినే చక్కని భాగ్యమీవే..త్యాగమాలా కురియవేలా..!?
తనదు సుఖమే మరచిపోయే..వాని మోమును చూడవమ్మా..!
అలసటెరుగని ప్రణయ హృదికే..హాసమాలా కురియవేలా..!?
నిన్ను డాక్టరు చేయు కోరిక..ఏల కలిగెనొ చిన్ననాడే..?!
కన్నతల్లిగ కాచు దొరనే..కన్నమాలా కురియవేలా..!?
ఊరి ప్రజలకు ఊపిరయ్యే..ఊయలాతని శ్వాస చూడూ..!
కొంటెతనమది పోనివాడే..ప్రేమమాలా కురియవేలా..!?
కోరి మానవ సేవ చేసే..నిత్య ''మాధవ'' రూపుడతడే..
వాని సన్నిధి చేరి మురిసే..స్నేహమాలాకురియవేలా..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు