Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

598..
ఏమాయె'నొ ఏమొ..చెలియ నిండె.. తలపుల గగనాన..! 
వెన్నెలంటి జీవితమే..మిగిలె..వలపుల గగనాన..!
ఆరాధన పొంగు వేళ..మాటలెంత భారమౌనొ..?!
తెలిపేందుకు రాదు కదా..అలక చూపుల గగనాన..!
పూలలోన మధువులేల..చేరేనో పలుకుటెలా..?!
భాషలసలు చాలవుగా..మొలక నవ్వుల గగనాన..!
జవరాలికి ఇష్టమైన..ఇంద్రధనువు నా తనువట..!
చిత్రాలను గీయుటెలా..తీపి సిగ్గుల గగనాన..!?
నా కోమలి మనోరథము..తీర్చేందుకు వీలౌనా..?!
జన్మకథలు వ్రాయతగునె..సొగసు మెరుపుల గగనాన..!?
తన'మాధవ' దేవునితో..నేను ఐక్యమైన చాలు..!
స్వరగతులను లాలింతును..నీలి మబ్బుల గగనాన..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

తలపుల గగనాన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.