601..
నీ నవ్వుల జల్లులోన..నేను తడిసి పోతున్నా..!!
నీ చూపుల కొలువులోన..నేను వెలిగి పోతున్నా..!!
మాయమయే క్రొవ్వొత్తుల..వలపులన్ని మధురములే..!!
విద్వత్తుల మత్తులోన..నేను తూలి పోతున్నా..!!
నువు తాకీతాకగనే..ఎన్ని వేల విద్యుత్తులొ..!?
యుగయుగాల మధువులోన..నేను కరిగి పోతున్నా..!!
నీ తలపే పానుపైన..ప్రతి క్షణం అపురూపం..!
రాగసుధల సరసులోన..నేను మురిసి పోతున్నా..!!
కనుపాపల సయ్యాటల..కోవెలలో దీపమెదో..!?
ప్రణయ జలధి సొగసులోన..నేను ఒదిగి పోతున్నా..!!
'మాధవు'నే తెలుసుకునే..ముచ్చటెంత మనోహరం..?!
మౌనవేణు తనువులోన..నేను తేలి పోతున్నా..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు