నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.

నన్ను ప్రభావితం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు

గాంధీజీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తినైనా ప్రేమతో జయించవచ్చు. మనం ముందు చూస్తే వల్లభాయ్ పటేల్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ యుద్ధం చేసి విజయాన్ని సాధించాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ ఫలితాలు అన్ని వేస్ట్ అయ్యాయి. కానీ గాంధీజీ మాత్రం సహనం,ఓర్పు ,ప్రేమ అని ,ఏ మనిషినైనా ప్రేమ ద్వారా జయించవచ్చు అని నమ్మారు. అంటే ఒక వ్యక్తిపైన మనం అజమాయిషీ చేస్తే, అతను లోబడకపోగా మనమీద తిరగబడి అసహ్యించుకుంటాడు.  ఈ సిద్ధాంతం తెలుసుకొని గాంధీజీ ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాలని ఓర్పు భావాన్ని తెలియచేశారు. ఈవిధంగా గా ట్రెండ్ మార్చారు ,ముందు కేవలం యుద్ధం వల్లే సాధించుకోగలం అన్నదాన్ని శాంతి వల్ల సాధించవచ్చని ట్రెండ్ మార్చి సాధించాడు.

                  కానీ ఈ సమాజంలో కొందరు గాంధీజీని జాతిపితగా అంగీకరిస్తే, కొంతమంది గాడ్సేని ఆరాధించేవారు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి మనసు గెలుచుకోవాలంటే ఒక సూత్రాన్ని మనందరికీ తెలియచేశారు. ఈ సూత్రం ఆధారంగా నేడు ధర్నాలు, నిరాహారదీక్షలు, శాంతియుత పోరాటాలు అన్నీ గాంధీ గారి అడుగుజాడల్లోనే సాగుతున్నాయి. ఇప్పటికీ కొంతమంది నక్సలైట్లు అల్లూరి సీతారామరాజు , వల్లభాయ్ పటేల్ లాకొట్టి సాధించుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ అవి ఎప్పటికీ పనికిరావు, ఎప్పటికీ సాధించలేము. ప్రేమతో సాధించవచ్చు, దౌర్జన్యం చేస్తే ఏమీ రాదు అని గాంధీజీ చెప్పిన సాధు స్వభావం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆనాడు గాంధీజీ కంటే రాజ్యాన్ని సాధించాలని ,తమ ప్రతాపాన్ని చూపించాలని ఎంతో మంది ప్రయత్నాలు చేసినా అలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రం సాధించలేమని శాంతియుత పోరాటం చేశాడు. ఈనాడు ధర్నాలు చేయడానికి నాంధి గాంధీజీ. కానీ నేడు ఆయన నీచుడు అని కొందరు రాజకీయనాయకులు విలన్ను చూపించినట్టు చూపిస్తున్నారు. ఇది చాలా తప్పు. శాంతి పోరాటానికి మించిన ఆయుధం ఏదీ లేదు. ఇప్పుడు గాంధీజీ చనిపోవచ్చు కానీ ఆయన మనలో నింపిన స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోదు. నిరాహారదీక్ష, మౌనం ఇవి ఎప్పటికైనా సక్సెస్ అవుతాయి. గాంధీజీ కంటే ముందు అనేకమంది కత్తి యుద్దాలు, మల్లయుద్ధాలు వంటివి జరిగాయి. వాటికంటే శాంతియుత పోరాటం ఎంతో మేలైనదనిగాంధీజీ శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. మన పోరాటం కూడా హింసాపుర్వకంగా ఉండకూడదు. ఒక వ్యక్తి మనలను హింసించాడని  తిరిగి వాళ్ళను హింసించుకుంటూ పోతుంటే మానవజాతి అంతరించిపోతుంది. కాబట్టి మనం హింసించేవారిని ప్రేమించాలి. సర్వేజనా సుఖినోభవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి. దుష్టశిక్షణ అంటే దుష్టుడిని శిక్షించాలి , అందరూ దుష్టులే అంటే ఏ ఒక్కడు బ్రతకడు .  ఈనాడు జీహాదీ అన్న పేరుతో మనుషులను చంపేయడం అలవాటైపోయింది ,అది ఒక పవిత్రయుద్ధం కానీ దానిని ఒక పనికిమాలిన యుద్ధంగా చేసేశారు. ఆ విషయం వదిలేయండి. ఒకని మనస్సు గెలుచుకోవాలనే కోరిక ఒక గాంధీని జాతిపితను చేసింది. ఇది ఆయన అహింసా ఆయుధం . ఒక మనిషిని చంపితే వాళ్ళ వారసులు మనల్ని చంపేస్తారు. కాబట్టి అందుకే ఆయన ఒకని మనస్సును గెలుచుకోవాలని అనుకున్నాడు. జాతిపిత అయ్యాడు. మహాత్ముడయ్యాడు. గాంధీజీకి గొప్పతనం మన దేశంలో ఇవ్వకపోయినా అనేక దేశాలు ఆయనకు ఎంతో విలువను ఇస్తున్నాయి . కొట్టడం తిట్టడం వల్ల ఏమీ రాదు సహనంతో న్యాయాన్ని గెలుచుకోవాలి. ఉద్రేకపడకూడదు అని ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి. ఉదాహణకు ఒక విషయం చెప్తాను  ,ఒకసారి గాంధీగారు లండన్ కి వెళ్ళినప్పుడు నల్లవాల్లకు వెంట్రుకలు కత్తిరించం అన్నారు అంటే వివక్షత మనదేశంలో కూడా ఉందనుకోండి కానీ ఆయన తన వెంట్రుకలు తానే కత్తిరించుకున్నాడు . ఆయన తగ్గించుకొని తన లక్ష్యాన్ని సాధించి పట్టా అందుకుని , దీక్ష కలిగి చదువును పూర్తి చేశాడు . ఆయన బారిష్టర్ పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశానికి వచ్చి హరిజనోద్దరణ ఉద్యమం చేశారు . ఆ ఉద్యమం చేయాలంటే ఆషామాషీ కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేటికీ మనం దళితులపై జరిగే అరాచకాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గుళ్ళకి వెళ్ళడానికి అనుమతి లేదు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణం పొన్నాపురంలో రామలింగేశ్వర ఆలయంలోకి దళితులను రానీయలేదు. మళ్లీ సబ్ కలెక్టర్ వచ్చి అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం జరిగింది. ఇంకా ఎన్నో రకాలుగా కుల పిచ్చి మత పిచ్చి లాంటివి ఉన్నాయి. అయినా ఇలాంటివి ఏమీ లెక్కచేయకుండా హరిజనొద్దరణ ఉద్యమాన్ని నడిపారు. ప్రస్తుత కాలంలో దళితులపై జరుగుతున్న దాడులను చూస్తే మనకు విదేశీయుల నుంచి స్వాతంత్య్రం వచ్చిన స్వదేశం నుంచి స్వాతంత్య్రం రాలేదు. 

            కాబట్టి గాంధీగారు ఎలా అయితే తాను అనుకున్న పని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సాధించారో , అలాగే మనం సంకల్పించుకున్న పని ఎలాంటి అవరోధాలు లేదా అపనిందలు ఎన్ని వచ్చినా సాధించాలనే అంశాన్ని నేను గాంధీగారి జీవితంలో నేర్చుకున్నాను . అందుకే గాంధీగారు నన్ను ఎక్కువ ప్రభావితం చేశారు. 

నెలవల సహజ ,

చిత్తూరు జిల్లా .

 

 

 

 

నన్ను ప్రభావితం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.