@గజల్ మహల్ - 05-01.// 616 //
నీ ప్రేమయే వరములాగ..పొందాలని ధ్యాస ప్రియా..!
నీవు తలచు శివునిలాగ..మిగలాలని ధ్యాస ప్రియా..!
జగమంతా శివరూపని..తెలుసుకున్న నెరజాణా..!
నీ అడుగుల దారిలాగ..మారాలని ధ్యాస ప్రియా..!
వైద్యవృత్తి నిర్వహణలొ..దైవత్వం..మొదట కదా..!
నీ భక్తికి మెరుపులాగ..చేరాలని ధ్యాస ప్రియా..!
నీ మనస్సు తెలిసెనులే..నీ మిత్రురాండ్ర వలన..!
మన చెలిమిని తోటలాగ..పెంచాలని ధ్యాస ప్రియా..!
ముభావముగ ముచ్చటగా..పని చేసే మనోహరీ..!
నీ తియ్యని శ్వాసలాగ..మిగలాలని ధ్యాస ప్రియా..!
ముగ్ధత్వపు కోవెలలో..శివ'మాధవ' మోహినివే..!!
నీ వలపుల సాక్షిలాగ..వెలగాలని ధ్యాస ప్రియా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు