@గజల్ మహల్ - 05-02.// 618 //
వ్రాయరాని లేఖ కదా..వలపంటే.. ఓ చెలియా..!
నీ శివుడను..నమ్మవేమి..నేనంటే.. ఓ చెలియా..!
తెలిసెనులే నీదు తపము..ఎందులకో.. సేవాప్రియ..!
ప్రాణమసలు నిలువదుగా..కాదంటే.. ఓ చెలియా..!
నీ స్నేహిత వర్గమంత..నీ మనస్సు తెలిపాయిగ..!
మన చదువులు వ్యర్థముగా..లేదంటే.. ఓ చెలియా..!
మాట కన్న గొప్ప మందు లేదన్నది నిజం కదా..!
చెప్పలేని ఆరాధన..నువ్వంటే.. ఓ చెలియా..!
ఎంత మధుర భక్తి నీది..నే కోరెద నీ సన్నిధి..!
నీతోనే కలకాలం..బ్రతుకంటే.. ఓ చెలియా..!
శివ'మాధవ' బేధమేల..చూపేరో లోకంలో..!
నా లోకం నీవే మరి..చూడంటే..ఓ చెలియా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు