@ 04-02-2016..ముషాయిరా గజల్..// 628 //
భువనమ్ముల కరుణమేఘ వర్షాలను ఆపలేము..!
మనుజజన్మ కోరుకునే భోగాలను ఆపలేము..!
లేదు వాన..కాలుష్యపు తాండవాన మునిగినాము..
చెలరేగే ఉత్పాతపు తాపాలను ఆపలేము..!
మందులనే ప్రేమిస్తూ మంచంలో పడిఉంటే..
పోటెత్తే భీకరమౌ..రోగాలను ఆపలేము..!
మాంసమునే భుజియిస్తూ హింస ఎలా చేస్తారో..
తమకు తాము చేసుకునే పాపాలను ఆపలేము..!
జీవకోటి సర్వములో..దైవముంది సత్యము కద..!
జీవహింస పాపమనే వేదాలను ఆపలేము..!
నిత్యసత్య సూత్రమంటె..ప్రేమన్నది తెలియనిదా..!
జ్ఞానకాంతి పంచుతున్న చరణాలను ఆపలేము..!
అహింసతో జీవిస్తే నీవేగా మాధవుడవు..!
విశ్వములో జరుగుతున్న యుద్ధాలను ఆపలేము..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు