4615..గజల్.
ప్రతి ప్రశ్నకు సరిజవాబు..ఇచ్చేనోయ్ నీ మనసే..!
ప్రేయసిగా నిజసఖునిగ..ఉండేనోయ్ నీ మనసే..!
కష్టమసలు దరిచేరదు..ప్రేమపూల తోటలోకి..
చిరునవ్వుల వెన్నెలసిరి..కురిసేనోయ్ నీ మనసే..!
నిత్యచెలిమి మేఘంలా..కదులుతీరు తెలిసేనా..
కాంతినదుల సంగమమై..నిలిచేనోయ్ నీ మనసే..!
ఆశలేని ఎదురుచూపు..దాటించును గగనాలను..
చైతన్యపు రథంలాగ..మిగిలేనోయ్ నీ మనసే..!
ఒక చంద్రుడు సూర్యునిలా..వెలిగేనా ఒకరోజున..
మౌనాద్భుత గీతముగా..మారేనోయ్ నీ మనసే..!
క్షణక్షణం దివ్యప్రసవ..వేదనలో పుడమితల్లి..
గమనిస్తే ఆవేదన..చూసేనోయ్ నీ మనసే..!
కత్తులైన బాంబులైన..బలాదూరె మాధవుడా..
రణతంత్రములెల్ల చిత్తు..చేసేనోయ్ నీ మనసే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు